ఏప్రిల్ 22న విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం

Published on Mar 13,2019 03:20 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఏప్రిల్ 22న ప్రారంభం కానుంది . ఇక ఈ సినిమాకు '' హీరో '' అనే టైటిల్ పెట్టారు . మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహించనున్నాడు . ఈవిషయాన్ని అధికారికంగా తెలియజేసారు ఈరోజు . విజయ్ దేవరకొండ కు గీత గోవిందం చిత్ర తర్వాత ఎనలేని క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే . 

భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ , కన్నడ బాషలలో నిర్మించనున్నారు . తన మార్కెట్ ని పెంచుకునే క్రమంలో బహు బాషా చిత్రాలను చేస్తున్నాడు విజయ్ దేవరకొండ . ఇంతకుముందే నోటా చిత్రంతో తెలుగు , తమిళ సినిమా చేయగా తాజాగా తెలుగు , తమిళ భాషలతో పాటుగా కన్నడ భాషలో కూడా '' హీరో '' చిత్రం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ .