వరల్డ్ ఫేమస్ లవర్ ఆంధ్ర హక్కులకు ఫ్యాన్సీ ఆఫర్

Published on Dec 06,2019 12:35 PM

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర ఆంధ్రా హక్కులను ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి సొంతం చేసుకున్నాడు అభిషేక్ నామా. పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడమే కాకుండా భారీ ఎత్తున విడుదల చేసిన అభిషేక్ నామా తాజాగా విజయ్ దేవరకొండ చిత్రాన్ని ఆంధ్రాలో విడుదల చేయడానికి ముందుకు వచ్చాడు. మంచి రేటు ఇచ్చి ఆంధ్రా హక్కులను సొంతం చేసుకున్నాడట.

ఇక ఈ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ఫిబ్రవరి 14 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డేట్ కూడా అధికారికంగా ప్రకటించాడు పంపిణీదారుడు అభిషేక్ నామా. విజయ్ దేవరకొండ సరసన ఈ చిత్రంలో నలుగురు భామలు రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ , కేథరిన్ , ఇస బెల్లా నటిస్తున్నారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె ఎస్ రామారావు , వల్లభ నిర్మిస్తున్నారు.