డియర్ కామ్రేడ్ రీ షూట్

Published on Feb 13,2019 03:58 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మీక మందన్న నటిస్తోంది. 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రష్  చూసాడట హీరో విజయ్ దేవరకొండ. అయితే అనుకున్న స్థాయిలో కొన్ని సన్నివేశాలు రాకపోవడంతో వాటిని మళ్లీ తీద్దామని చెప్పాడట దర్శకుడికి . అలాగే నిర్మాతలకు కూడా. 

హీరో చెప్పాక ఇక తిరిగేముంటుంది దర్శక నిర్మాతలు కూడా సరే అన్నారట. దాంతో త్వరలోనే డియర్ కామ్రేడ్ రీ షూట్ జరుగనుంది. రష్మీక మందన్న ఈ చిత్రంలో క్రికెట్ ప్లేయర్ గా నటిస్తోంది.