విజయ్ దేవరకొండ ని చూడటానికి ఎగబడుతున్న జనం

Published on Feb 01,2019 12:32 PM

టాలీవుడ్ లో క్రేజీ హీరో ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు విజయ్ దేవరకొండ . గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో గత ఏడాది సంచలన విజయాలు అందుకున్నాడు . కాగా ఈ హీరో ఇప్పుడు లేబర్ లీడర్ గా మారాడు . తాజాగా ఈ హీరో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు . ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ కార్మిక నాయకుడిగా నటిస్తున్నాడు . కార్మిక నాయకుడి గెటప్ లో ఉన్న విజయ్ దేవరకొండ ని చూడటానికి కొత్తగూడెం పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు . 

పెద్ద ఎత్తున ప్రజలు వస్తుండటంతో వాళ్ళని అదుపు చేయడానికి చాలా కష్టాలు పడుతున్నారు పోలీసులు . ప్రస్తుతం కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది . ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ నాయికలుగా నటిస్తున్నారు .