కష్టపడుతున్న విజయ్ దేవరకొండ

Published on Jan 13,2020 04:51 PM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఫైటర్ చిత్రం కోసం చాలా కష్టాలు పడుతున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ గా నటించడానికి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందే చిత్రం కావడంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు ఈ హీరో. ఇక మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతులైన గురువులను ఏకంగా 15 మందిని ఎంచుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ 15 మంది చేత రకరకాల టెక్నీక్ లను నేర్చుకుంటున్నాడు అవన్నీ ఫైటర్ సినిమాలో చూపించే ప్రయత్నం కోసమే ఇంతమందిని ఎంచుకున్నాడు విజయ్ దేవరకొండ.

ఛార్మి నిర్మాతగా మారి కరణ్ జోహార్ తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తోంది. హిందీలో కూడా ఫైటర్ చిత్రం విడుదల కానుంది అందుకే కరణ్ జోహార్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు పూరి జగన్నాధ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక ఈ ఫైటర్ సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషలలో ఫైటర్ చిత్రం రూపొందనుంది.