విజయ్ దేవరకొండ ఇంకా స్పందించలేదు !

Published on Apr 02,2020 11:36 AM
టాలీవుడ్ లో నయా సూపర్ స్టార్ గా ఎదుగుతున్న హీరో విజయ్ దేవరకొండ అయితే ఈ క్రేజీ హీరో ఇంతవరకు కరోనా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ పట్ల స్పందించలేదు అలాగే విరాళం కూడా ప్రకటించలేదు దాంతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళం ఇవ్వొచ్చు లేదంటే సినీ పరిశ్రమ తరుపున ఫండ్ రైజ్ చేస్తున్నారు దానికి అయినా ఇవ్వొచ్చు లేదంటే తానే స్వయంగా రంగంలోకి దిగి ఏమైనా చేయొచ్చు కానీ ఇప్పటివరకు విజయ్ దేవరకొండ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఎలాంటి విపత్తు వస్తే ముందుండే విజయ్ దేవరకొండ ఇప్పటివరకు స్పందించకపోవడం ఏంటి ? అని చర్చించుకుంటున్నారు. ఇప్పుడు స్పందించకపోయినా త్వరలోనే ప్రకటించడం ఖాయమని నమ్ముతున్నారు. మరి స్పందిస్తాడా ? లేదా ? చూడాలి. ఇక సినిమా విషయానికి వస్తే ...... పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.