విరాళాలు ఇవ్వండంటున్న విజయ్ దేవరకొండ

Published on May 02,2020 11:27 AM
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తన ఫౌండేషన్ కోసం విరాళాలు కోరుతున్నాడు. కరోనా వైరస్ తో దేశమంతటా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోయారు దాంతో పని చేసుకుంటేనే డబ్బులు వచ్చే పేదల కోసం '' ది దేవరకొండ ఫౌండేషన్ '' ని స్థాపించాడు ఇటీవలే. మిడిల్ క్లాస్ ఫండ్ అంటూ రైజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.

ఇందుకోసం 25 లక్షలను కేటాయించాడు. అయితే పేదల నుండి పెద్ద మొత్తంలో సహాయం చేయండి అంటూ అర్జీలు రావడంతో అందరికీ చేయలేకపోయాడు. కేవలం 6 వేల కుటుంబాలకు మాత్రం నిత్యావసర సరుకులు 1000 రూపాయల విలువ గలవి అందించాడు విజయ్ దేవరకొండ. కానీ ఇతడి ఫౌండేషన్ కు ఏకంగా 77000 వేల కుటుంబాలు సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నాయట. దాంతో నా ఫౌండేషన్ కు విరాళాలు ఇవ్వండి పేదలకు సహాయం చేద్దాం అని ప్రకటన జారీ చేసాడు. మరి ఈ ప్రకటన చూసి సహాయం చేసేవాళ్ళు ముందుకు వస్తారో చూడాలి.