మరో ఛాలెంజ్ కు సిద్దమైన విజయ్ దేవరకొండ

Published on Nov 12,2019 10:47 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మరో ఛాలెంజ్ కు సిద్దమయ్యాడు. అయితే ఆ ఛాలెంజ్ ని విజయ్ దేవరకొండ స్వీకరిస్తాడా ? లేదా ? అన్నది చూడాలి. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి ? విజయ్ దేవరకొండ కు ఆ ఛాలెంజ్ విసిరింది ఎవరో తెలుసా ? గ్రీన్ ఛాలెంజ్ తెలంగాణలో సాగుతున్న విషయం తెలిసిందే. ఆ ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ హీరో విజయ్ దేవరకొండ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరాడు.

ఇంతకుముందు కూడా ఇలాంటి సవాల్ ఎదురైనప్పుడు మొక్క నాటాడు విజయ్ దేవరకొండ. ఇక ఇపుడు అరవింద్ కుమార్ ఛాలెంజ్ ని స్వీకరించి ఎప్పుడు మొక్క నాటుతాడో చూడాలి. తాజాగా ఈ హీరో నిర్మించిన మీకు మాత్రమే చెప్తా విడుదలై నిరాశపరిచింది. దాంతో ఖంగుతిన్న విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. వరల్డ్ ఫేమస్ లవర్ గా నటిస్తున్న ఈ హీరో ఆ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ గా నటించనున్నాడు.