సాయంలో తన ప్రత్యేకత చాటుకున్న విజయ్ దేవరకొండ

Published on May 02,2020 11:23 AM
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సాయంలో తన ప్రత్యేకత నిరూపించుకున్నాడు. కరోనా మహామ్మారీ విలయతాండవం చేస్తుండటంతో పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం విరాళం ప్రకటించలేదు దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా ఈ హీరో పట్టించుకోలేదు. ఇక ఇప్పుడేమో తన ప్రత్యేకత చాటుకున్నాడు సహాయంలో.

ఒక కోటి రూపాయలతో ది దేవరకొండ ఫౌండేషన్ ని ఏర్పాటు చేసాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ఒక లక్ష మంది యువతని ఉన్నత స్థాయిల్లో నిలబెట్టేలా ఆలోచన చేస్తున్నాడు. ఇక కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం మరో ఫౌండేషన్ ని స్టార్ట్ చేసాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు నిత్యావసరాలు ఇవ్వడానికి 25 లక్షలు కేటాయిస్తున్నారు. ఈ డబ్బుతో ప్రజలు నమోదు చేసుకున్న వాళ్లకు ఇంటికే నిత్యావసరాలు విజయ్ దేవరకొండ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు అందించనున్నారు.