పెళ్లి గురించి విజయ్ దేవరకొండ ఏమన్నాడో తెలుసా ?

Published on Oct 28,2019 05:20 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ 3 హౌజ్ లోకి వెళ్ళాడు. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మీకు మాత్రమే చెప్తా చిత్రం నవంబర్ 1 న విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళాడు విజయ్ దేవరకొండ. ఈ హీరోతో పాటుగా తరుణ్ భాస్కర్ తదితరులు కూడా వెళ్లారు. ఇక హౌజ్ లోకి వెళ్లిన విజయ్ దేవరకొండ ని ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు ? ఎప్పుడు చేయూసుకోబోతున్నావ్ అంటూ కింగ్ నాగార్జున ప్రశ్నించాడు .

దానికి విజయ్ దేవరకొండ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా ? నాకు ఇంకా అమల దొరకలేదు ...... అమల దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను అని సమాదానం ఇచ్చాడు దాంతో నివ్వెర పోయిన నాగార్జున ఓకే నీ అమల దొరికినప్పుడే పెళ్లి చేసుకో అంటూ పకపకా నవ్వాడు.