యంగ్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ యంగ్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ

Published on Feb 05,2019 03:40 PM

విజయ్ దేవరకొండకు యంగ్ డైరెక్టర్ లు బాగా కలిసి వస్తున్నారు . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , టాక్సీ వాలా చిత్రాలతో సరికొత్త సంచలనం సృష్టించాడు ఈ హీరో , ఆ మూడు చిత్రాలకు కూడా కొత్త దర్శకులు కావడం విశేషం . తరుణ్ భాస్కర్ , సందీప్ రెడ్డి వంగా , రాహుల్ సంక్రుత్యాన్ ఈ ముగ్గురు కూడా విజయ్ దేవరకొండ కు మంచి హిట్స్ ఇచ్చారు . ఇక ఇప్పుడు కూడా మరో యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . 

ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే హుషారు చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శ్రీహర్ష కొనుగంటి . గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన హుషారు చిత్రం విజయవంతంగా 50 రోజులను పూర్తిచేసుకుంది . దాంతో శ్రీహర్ష తో సినిమా చేస్తానని మాటిచ్చాడట విజయ్ , ప్రస్తుతం విజయ్ దేవరకొండ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు శ్రీహర్ష .