అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా

Published on Feb 22,2020 12:47 PM

విజయ్ దేవరకొండ - సందీప్ రెడ్డి వంగా ల కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండని స్టార్ హీరోని చేసింది అర్జున్ రెడ్డి చిత్రమే ! తెలుగునాట కల్ట్ మూవీగా సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళీ సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేయలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆ అవసరం ఏర్పడిందని అందుకే మళ్ళీ సినిమా చేయనున్నారని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతుండటంతో ఈ నిర్ణయానికి వచ్చాడట. విజయ్ దేవరకొండ నటించిన నోటా , డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు వరుసగా అట్టర్ ప్లాప్ అయ్యాయి. దాంతో విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ అమాంతం తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో తప్పకుండా సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట విజయ్ దేవరకొండ.