విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ఫిబ్రవరి 14 2020న రిలీజ్

Published on Nov 24,2019 05:26 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని ఫిబ్రవరి 14 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 14 న లవర్స్ డే కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కే ఎస్ రామారావు ,వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నాలుగు విభిన్న గెటప్ లలో కనిపించనున్నాడు.

ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అందాల భామలు రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ , కేథరిన్ ట్రెసా , ఇజా బెల్లె లు నటించనున్నారు. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ విభిన్నంగా కనిపించనున్నాడట. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కావడంతో త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారట.