విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోలేదట

Published on Oct 21,2019 03:41 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ''హీరో'' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు వరుస కథనాలు వస్తున్నాయి అలాగే ఫిలిం నగర్ లో రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి అయితే అవన్నీ తప్పుడు వార్తలే అని అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ అయ్యిందని నవంబర్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందని అంటున్నారు.
బైక్ రేసింగ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ''హీరో'' సినిమా రూపొందుతోంది. విజయ్ దేవరకొండ తానూ నిర్మాతగా మారి మీకు మాత్రమే చెప్తా అనే చిత్రాన్ని నిర్మించాడు ఆ సినిమా ప్రమోషన్ కోసం కొంత గ్యాప్ తీసుకున్నాడని అందుకె ఈ పుకార్లు వచ్చి ఉంటాయని అంటున్నారు. మొత్తానికి హీరో సినిమా ఆగిపోలేదని మాత్రం అంటున్నారు.