22 కోట్ల బిజినెస్ చేసిన విజయ్ దేవరకొండ చిత్రం

Published on Feb 12,2020 02:40 PM

విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం 22 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వల్లభ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ , కేథరిన్ ట్రెసా , ఇసా బెల్లె అనే నలుగురు అందమైన భామలు నటించారు. ఈ చిత్రాన్ని ప్రేమికుల కానుకగా ఫిబ్రవరి 14 న విడుదల చేయనున్నారు. అంతకుముందు వరకు పెద్దగా బయ్యర్లు పట్టించుకోని ఈ చిత్రాన్ని విడుదలకు ముందు మాత్రం పోటీ పడి మరీ కొనుక్కున్నారు.

దాంతో ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది వరల్డ్ ఫేమస్ లవర్. 22 కోట్ల షేర్ రావాలంటే 45 నుండి 50 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టాలి ఈ చిత్రం. ఆ స్థాయి వసూళ్లు రావాలంటే ఓపెనింగ్స్ కూడా పెద్ద మొత్తంలోనే రాబట్టాలి. టాక్ బాగుంటే తప్పకుండా ఈ మొత్తాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమి కాదు. అయితే టాక్ ఏమాత్రం బాగాలేకపోతే బయ్యర్లు నష్టపోవడం ఖాయం. అయితే అది ఏంటి ? అన్నది మాత్రం ఈనెల 14 న తేలనుంది వరల్డ్ ఫేమస్ లవర్ భవితవ్యం.