కరోనా గురించి జాగ్రత్తలు చెబుతున్న విజయ్ దేవరకొండ

Published on Mar 10,2020 08:33 PM

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి విజయ్ దేవరకొండ కరోనా వైరస్ పై యుద్ధం ప్రకటించాడు. కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలో చెబుతూ ఓ వీడియో ని రూపొందించారు హీరో విజయ్ దేవరకొండ ఈ వీడియోని రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా వైరస్ తో యావత్ ప్రపంచం భయంతో వణికిపోతోంది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ సోకిన ఒక వ్యక్తి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కరోనా తో వణికిపోతున్న ప్రజలకు అవగాహన కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఈ ప్రకటనలో నటించాడు విజయ్ దేవరకొండ. కరోనా వల్ల భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అంటున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఈ హీరో ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు దాదాపు 40 రోజుల భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసి ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు విజయ్ దేవరకొండ.