విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదుగా

Published on Mar 06,2019 04:12 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు. ఇప్పటికే తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో తాజాగా త్రిభాషా చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నోటా చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమైన విజయ్ దేవరకొండ తాజా చిత్రం తో తెలుగు , తమిళంతో పాటుగా కన్నడ భాషల్లో కూడా నటించడానికి సిద్ధం అవుతున్నాడు. 

ఆనంద్ అన్నామలై అనే తమిళ  దర్శకుడు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మూడు బాషలలో నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా నటించనున్నాడు. ఇందుకోసం ప్రస్తుతం చెన్నైలో బైక్ రేసింగ్ చేస్తూ బాగానే కష్టపడుతున్నాడు.