ముంబై పార్టీలో విజయ్ దేవరకొండ

Published on Nov 17,2019 08:10 AM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ముంబై లో జరిగిన పార్టీలో పాలుపంచుకున్నాడు. విజయ్ దేవరకొండ రాకతో అక్కడి పార్టీలో సరికొత్త జోష్ వచ్చింది. ఇక ఈ క్రేజీ హీరోకు తోడుగా అందమైన భామలు దీపికా పదుకోన్ , కియారా అద్వానీ , అలియా భట్ , జాక్వెలెన్ ఫెర్నాండేజ్ లు కూడా హాజరయ్యారు దాంతో ఈ వేడుకకు మరింత అందం వచ్చింది. అందమైన భామలను అలాగే విజయ్ దేవరకొండని  కరణ్ జోహార్ ఆహ్వానించాడు.

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ గా సంచలన విజయం సాధించడంతో ఈ హీరోకు ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది. హిందీలో విజయ్ దేవరకొండ నటించలేదు కానీ అప్పుడే హీరోయిన్ లలో కూడా విజయ్ అంటే పడిచచ్చే వాళ్ళున్నారు మరి. ప్రస్తుతం ఈ హీరో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటిస్తున్నాడు.