బంపర్ ఆఫర్ కొట్టేసిన విజయ్ దేవరకొండ

Published on Dec 21,2019 09:02 AM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్ కొట్టేసాడు అది కూడా తెలుగులో కాదు హిందీలో సుమా ! బాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న యష్ రాజ్ ఫిలింస్ విజయ్ దేవరకొండకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలుగు అలాగే హిందీలో ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తామని అందుకు గాను భారీ రెమ్యునరేషన్ ని కూడా ఆఫర్ చేసిందట. దాంతో ఈ టాపిక్ సంచలనం సృష్టిస్తోంది ఫిలిం నగర్ సర్కిల్లో. విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది దాంతో ఈ ఆఫర్ వచ్చింది.

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ గా రీమేక్ చేసారు. తెలుగులో 50 కోట్లు మాత్రమే సాధించిన అర్జున్ రెడ్డి , హిందీలో మాత్రం 300 కోట్లు వసూల్ చేసింది దాంతో విజయ్ దేవరకొండకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. దాంతో ఈ హీరోతో హిందీలో సినిమాలు నిర్మించడానికి కరణ్ జోహార్ లాంటి వాళ్ళు సైతం పోటీ పడుతున్నారు అందుకే యష్ రాజ్ ఫిలింస్ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది విజయ్ దేవరకొండకు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు కానీ ఇస్తే ఆ హీరో రేంజ్ పెరిగినట్లే !