ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ

Published on Dec 10,2019 05:43 PM

విజయ్ దేవరకొండ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. ఇంతకీ ఉత్తమ నటుడు అవార్డు ఏ సినిమాకు వచ్చిందో తెలుసా ............             '' డియర్ కామ్రేడ్ '' అనే ప్లాప్ సినిమాకు. భరత్ కమ్మ అనే యువ దర్శకుడి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. మొదట ఈ చిత్రాన్ని ఒక్క తెలుగులోనే తీశారు అయితే సినిమాపై బాగా నమ్మకం ఏర్పడటంతో తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా విడుదల చేయాలనీ డిసైడ్ అయి తమిళ , మలయాళ , కన్నడ భాషలలో విడుదల చేసారు. అయితే దక్షిణాదిన నాలుగు భాషలలో విడుదల అయినప్పటికీ ఏ ఒక్క చోట కూడా ఈ సినిమా ఆడలేదు. అంతేకాదు కనీసం ఓ మోస్తారు ఓపెనింగ్స్ కూడా సాధించలేకపోయింది డియర్ కామ్రేడ్.

డియర్ కామ్రేడ్ పెద్ద హిట్ అవుతుందని భావించిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న దక్షినాదిలోని నాలుగు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు విభిన్నంగా చేసారు అయితే తెలుగులో మాత్రమే ఓ మోస్తారు కలెక్షన్లు వచ్చాయి మిగిలిన భాషలలో పోస్టర్ ఖర్చులు కూడా రాలేదట. దాంతో డియర్ కామ్రేడ్ ఈ హీరో ని నిరాశపరిచినప్పటికీ తాజాగా ఓ సంస్థ ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చి సత్కరించింది విజయ్ దేవరకొండని దాంతో సంతోషపడుతున్నాడు. నిన్న చెన్నై లో ఈ వేడుక జరుగగా కన్నడ స్టార్ హీరో యష్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నాడు ఈ క్రేజీ హీరో. తాజాగా ఈ హీరో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.