ప్లాప్ చవిచూసిన విజయ్ దేవరకొండ

Published on Feb 14,2020 06:31 PM
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మరో ప్లాప్ చవిచూశాడు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో. ఈరోజు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వల్లభ నిర్మించిన ఈ చిత్రం క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై రూపొందింది. విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా , కేథరిన్ ట్రెసా , ఐశ్వర్య రాజేష్ , ఇజా బెల్ నటించారు. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది.

అసలు ఈ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపై మొదటి నుండి కూడా పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి. క్రాంతి మాధవ్ దర్శకుడిగా వరుసగా అపజయాలు చవి చూస్తుండటం ఒక కారణమైతే విజయ్ దేవరకొండ నటించిన  డియర్ కామ్రేడ్ కూడా ప్లాప్ అవ్వడంతో ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకుండాపోయింది. అయితే సినిమా విడుదలకు ముందు హీరో విజయ్ దేవరకొండ చేసిన హంగామా తో కాస్త అంచనాలు పెరిగాయి దానికి తోడు లవర్స్ డే రోజున విడుదల కావడం కూడా కలిసి వచ్చింది కానీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ సినిమాకు మాత్రం ప్లాప్ టాక్ వచ్చింది.