మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోనున్న విజయ్ దేవరకొండ

Published on Aug 27,2019 11:22 AM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోనున్నాడు. తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ ని ఖరారు చేసారు , ఇక ఈ సినిమా కొత్త ఏడాది 2020 జనవరిలో ప్రారంభం కానుంది. ఈలోపు విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోనున్నాడు. 

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి ఎక్కువ భాగం విదేశాలలోనే షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ బ్యాంకాక్ వెళ్ళాడు అక్కడ స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసే పనిలో పడ్డాడు. స్క్రిప్ట్ వర్క్ అయ్యాక తిరిగి ఇండియాకు రానున్నాడు పూరి. ఈలోపు విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ లో తర్ఫీదు పొందనున్నాడు. ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్ళాకా ఆరు నెలల్లో విడుదల చేయడం పూరి స్టైల్ అంటే జూన్ తర్వాత ఫైటర్ ఎప్పుడైనా విడుదల కావచ్చన్న మాట.