విజయ్ దేవరకొండ కొత్త టైటిల్ లేబర్ లీడర్

Published on Feb 04,2019 11:02 AM

విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఇంకా పేరు నిర్ణయించని ఆ చిత్రానికి లేబర్ లీడర్ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు గా తెలుస్తోంది . సినిమా కథలో భాగంగా ఓ కీలక ఎపిసోడ్ లో సింగరేణి కార్మికుడిగా కనిపించనున్నాడు విజయ్ దేవరకొండ . దాంతో కథానుగుణంగా లేబర్ లీడర్ టైటిల్ సరిపోతుందని భావిస్తున్నారట . 

అయితే ఇంకా తుది నిర్ణయం ఏది తీసుకోలేదు చిత్ర బృందం . కేవలం ఆలోచన మాత్రమే చేస్తున్నారట . ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్ లు  నటిస్తున్నారు . రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ లను మొదటే ఎంపిక చేయగా తాజాగా మరో హాట్ భామ కేథరిన్ ట్రెసా ని ఎంపిక చేసారు . ఇక వీళ్ళతో పాటుగా మరో మోడల్ ని కూడా ఎంపిక చేశారట . దాంతో విజయ్ దేవరకొండ నలుగురు హీరోయిన్ లతో రొమాన్స్ చేయనున్నాడని తెలుస్తోంది .