విజయ్ దేవరకొండ కొత్త టైటిల్ హీరో

Published on Mar 06,2019 10:51 AM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా పూర్తి కావచ్చింది మరోవైపు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నాడు . ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక తెలుగు , తమిళ బాషలలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విజయ్ దేవరకొండ . ఇక ఆ చిత్రానికి '' హీరో '' అనే టైటిల్ ని పెట్టాలని భావిస్తున్నారట . 

ఇప్పటికే విజయ్ దేవరకొండ తమిళంలో నోటా చిత్రం చేసాడు . అది ప్లాప్ అయినప్పటికీ ఈ హీరోకు అక్కడ మంచి క్రేజ్ అయితే వచ్చింది . దానికి తోడు గీత గోవిందం సంచలనం సృష్టించడంతో విజయ్ దేవరకొండతో మరో ద్విభాషా చిత్రం చేయడానికి పోటీ పడుతున్నారు నిర్మాతలు . హీరో అనే టైటిల్ ని పెట్టాలని ఫిక్స్ అయ్యారట . నిన్న మొన్నటి వరకు విజయ్ దేవరకొండ ఒక్క తెలుగు కే పరిమితం కానీ ఇప్పుడు ఆ సరిహద్దులు చెరిగిపోయాయి తమిళంతో పాటుగా కన్నడ చిత్రంలో కూడా నటించడానికి రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ .