భారీ ప్రమాదం నుండి బయటపడిన విజయ్ దేవరకొండ

Published on Mar 06,2020 07:54 AM
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. ఫైటర్ చిత్రం కోసం ముంబై వెళ్లిన విజయ్ దేవరకొండ అక్కడ షూటింగ్ లో పాల్గొన్న సమయంలో కాలు తప్పి కిందపడబోయాడు. కొద్దిలో అయితే పూర్తిగా కింద పడేవాడే కానీ ఈలోపు పక్కన ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై విజయ్ దేవరకొండ కిందపడకుండా పట్టుకున్నారు దాంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

తృటిలో ప్రమాదం నుండి బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు హీరోతో సహా అతడి స్టాఫ్. ముంబై లో ఫైటర్ చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఈ క్రేజీ హీరో. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఛార్మి నిర్మాత కాగా బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఇక హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తోంది.