స్కై డైవింగ్ తో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ

Published on Nov 30,2019 11:47 AM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ స్కై డైవింగ్ చేస్తూ సంచలనం సృష్టించాడు. హెలికాప్టార్ నుండి కిందికి దూకి ఒక నిమిషం కు పైగా ఆకాశంలో ఓలలాడిన విజయ్ దేవరకొండ చేసిన సాహసం చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. విజయ్ దేవరకొండ స్కై డైవింగ్ చేసిన సమయంలో పక్కన ట్రైనర్ ఉన్నాడు కానీ ఆకాశంలో నుండి కిందకు దూకడం అంటే మాములు విషయం కాదు దానికి ఎంతో ధైర్యసాహసాలు కావాలి.

రౌడీ గా ముద్రపడిన ఈ హీరో ఏది చేసినా అగ్రెసివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కై డైవింగ్ చేసి తన అభిమానులను సంతోషంలో ముంచెత్తినప్పటికీ మరికొంత మందిని మాత్రం ఆందోళనకు గురి చేసాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఈ హీరో వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రం చేస్తున్నాడు. ప్రేమికుల రోజున ఆ సినిమా విడుదల కానుంది.