విజయ్ దేవరకొండ చేసేది తప్పో ఒప్పో తేలనుంది

Published on Oct 29,2019 11:38 AM

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ''మీకు మాత్రమే చెప్తా ''. తనని హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాడు. హాట్ భామ  అనసూయ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది. కొత్తతరహా చిత్రం అని అంటున్నారు విజయ్ దేవరకొండ అలాగే తరుణ్ భాస్కర్.
           మీకు మాత్రమే చెప్తా నవంబర్ 1 న విడుదల అవుతోంది. దాంతో విజయ్ దేవరకొండ చేసున్నది తప్పా ...... ఒప్పా అన్నది నవంబర్ 1 న తేలనుంది. సినిమా హిట్ అయితే తప్పకుండా విజయ్ దేవరకొండ మీద ప్రశంసల వర్షం కురుస్తుంది , లేదంటే విమర్శలు రావడం ఖాయం. అయితే అది ఏంటి అన్నది మాత్రం మరి మూడు రోజుల్లో తేలనుంది.