విజయ్ దేవరకొండ ఆ సినిమా చేయడం లేదట

Published on Apr 15,2019 10:26 AM

బాలీవుడ్ లో విజయం సాధించిన గల్లీ బాయ్ చిత్రాన్ని నేను రీమేక్ చేయడం లేదని , అలా వస్తున్న వార్తలన్నీ గాలి వార్తలు మాత్రమే అంటూ కొట్టి పడేసాడు విజయ్ దేవరకొండ . రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన గల్లీ బాయ్ చిత్రం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో రకరకాల హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి . విజయ్ దేవరకొండ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ పేరు కూడా వినిపించింది . అయితే ఇటీవలే సాయి ధరమ్ తేజ్ ఆ రీమేక్ చిత్రం గురించి చెప్పగా తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఖండించాడు గల్లీ బాయ్ రీమేక్ లో నటించడం లేదని . 

తాజాగా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు . బ్యాలన్స్ గా ఉన్న వర్క్ ని కంప్లీట్ చేస్తున్నారు . విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మే 31 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . భరత్ కమ్మ అనే దర్శకుడు డియర్ కామ్రేడ్ చిత్రంతో పరిచయం అవుతున్నాడు . తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ బాషలలో డియర్ కామ్రేడ్ చిత్రం విడుదల కానుంది .