విజయ్ దేవరకొండ ఎంత మాటన్నాడో తెలుసా ?

Published on Apr 01,2019 12:20 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కు బుల్లితెర అంటే చిన్న చూపు ఉన్నట్లుంది అందుకే బుల్లితెరపై నేను నటించేది లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు . తాజాగా ఈ హీరో ముంబై లో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్నాడు ఆ సందర్బంగా బుల్లితెర లో నటిస్తావా ? అంటే వెంటనే టక్కున సమాధానం చెప్పేసాడు ...... ఎప్పటికి బుల్లితెరపై నటించేది లేదని . 

అయితే వెబ్ సిరీస్ లు మాత్రం చేస్తాడట అంటే నిర్మిస్తాడట ! టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ . తాజాగా ఈ హీరో నటిస్తున్న చిత్రం '' డియర్ కామ్రేడ్ '' , కాగా ఈ చిత్రాన్ని మే 31న నాలుగు బాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటిస్తోంది .