విజయ్ దేవరకొండ తమ్ముడికి ఆ చిత్రం నచ్చిందట

Published on Nov 20,2019 04:01 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కు అప్పట్లో వచ్చిన తెలుగు చిత్రం '' తాళి '' బాగా నచ్చిందట దాంతో ఆ సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం తాళి సినిమా ని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి తీయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఆ మేరకు స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందట. ఆనంద్ దేవరకొండ దొరసాని చిత్రంతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే.

అయితే దొరసాని చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది దాంతో హిట్ కోసం రకరకాల ఆలోచనలు చేస్తున్నాడు. అన్నయ్య విజయ్ దేవరకొండ సపోర్ట్ పుష్కలంగా ఉండటంతో అతడి క్రేజ్ తో ఒడ్డున పడాలని చూస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. 1997 లో విడుదలైన తాళి చిత్రానికి స్వర్గీయ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ హీరోగా నటించగా ఆ పాత్రలో ఇప్పుడు ఆనంద్ దేవరకొండ నటించనున్నాడట.