మళ్ళీ రొమాన్స్ చేయనున్న అర్జున్ రెడ్డి జంట

Published on Mar 11,2019 05:44 PM

అర్జున్ రెడ్డి చిత్రంలో బోల్డ్ సన్నివేశాల్లో అంతే బోల్డ్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న జంట విజయ్ దేవరకొండ - షాలిని పాండే . అర్జున్ రెడ్డి సంచలన విజయం తర్వాత ఈ ఇద్దరికీ మంచి క్రేజ్ వచ్చింది అయితే విజయ్ దేవరకొండ వెంటనే స్టార్ హీరో అయిపోయాడు కానీ షాలిని పాండే మాత్రం స్టార్ కాలేకపోయింది . మహానటి , ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాల్లో గెస్ట్ గా నటించింది . 

అలాగే తాజాగా రిలీజ్ అయిన 118 చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నటించింది . కట్ చేస్తే మళ్ళీ అర్జున్ రెడ్డి జంట జంటగా కనిపించనున్నారు . త్వరలోనే ప్రారంభం కాబోయే విజయ్ దేవరకొండ కొత్త చిత్రంలో షాలిని పాండే ని ఒక హీరోయిన్ గా ఎంపిక చేశారట . తమిళ దర్శకుడు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఎన్ని ముద్దులు ఉంటాయో ? ఎన్ని హగ్గులు ఉంటాయో చూడాలి .