డ్యాన్స్ చేయలేనని ఒప్పుకున్న విజయ్ దేవరకొండ

Published on Dec 19,2019 06:02 PM

నేను ఇలాంటి చిత్రాన్ని జీవితంలో చేయలేనని , నాకు డ్యాన్స్ అంతగా రాదని ఒప్పుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. వరుణ్ ధావన్ - శ్రద్దా కపూర్ జంటగా బాలీవుడ్ లో రూపొందుతున్న చిత్రం '' స్ట్రీట్ డ్యాన్సర్ 3''. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదల అయ్యింది. ఆ ట్రైలర్ లో వరుణ్ ధావన్ - శ్రద్దా కపూర్ చేసిన డ్యాన్స్ కి ఫిదా అయ్యాడు ఈ హీరో దాంతో తనకు ఇంత బాగా డ్యాన్స్ రాదని పేర్కొంటూ వరుణ్ ధావన్ కు శ్రద్దా కపూర్ కు శుభాకాంక్షలు తెలియజేసాడు విజయ్ దేవరకొండ. ఇక స్ట్రీట్ డ్యాన్సర్ 3 చిత్రంలో ప్రభుదేవా కూడా నటించాడు.

డ్యాన్స్ నేపథ్యంలో తెరకెక్కిన స్ట్రీట్ డ్యాన్సర్ 3 జనవరి 24 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. విజయ్ దేవరకొండ కు నిజంగానే డ్యాన్స్ అంతగా రాదు కేవలం చిన్న చిన్న మూమెంట్స్ మాత్రమే చేస్తాడు అందుకే తనకు డ్యాన్స్ రాదు అని ఒప్పుకున్నాడు అంతేనా ఇలాంటి డ్యాన్స్ నా జీవితంలో చేయలేను కాకపోతే చూడగలను అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ హీరో వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం ఫిబ్రవరి 14 న విడుదల కానుంది.