విజయ్ దేవరకొండతో మజిలీ దర్శకుడు

Published on Nov 01,2019 04:56 PM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మజిలీ దర్శకుడు శివ నిర్వాణ. నాని హీరోగా నటించిన నిన్ను కోరి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ మొదటి చిత్రంతోనే తనదైన ముద్ర వేసాడు. ఇక ఆ తర్వాత నాగచైతన్య - సమంత జంటగా మజిలీ అనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక ఇప్పుడేమో ముచ్చటగా మూడో చిత్రంగా విజయ్ దేవరకొండతో చేయడానికి రెడీ అవుతున్నాడు శివ నిర్వాణ.

ఇక విజయ్ దేవరకొండ కూడా శివ నిర్వాణ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం హీరో అనే చిత్రాన్ని పక్కన పెట్టి పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు , అది అయ్యాక హీరో చిత్రాన్ని కంప్లీట్ చేస్తాడు ఇక అప్పుడు శివ నిర్వాణ తో ఉంటుంది విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం.