డిజిటల్ రైట్స్ లో సంచలనం సృష్టించిన విజయ్

Published on Dec 06,2019 12:39 PM
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బిగిల్ డిజిటల్ రైట్స్ లో సరికొత్త సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఏ తమిళ చిత్రానికి కూడా ఇవ్వనంత అధిక రేటు ని విజయ్ బిగిల్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది ఎవరో తెలుసా ...... అమెజాన్ . అవును అమెజాన్ ఈ భారీ మొత్తాన్ని ఇచ్చి బిగిల్ డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుందట. దాంతో తమిళనాట సంచలనంగా మారింది.

తమిళంలో బిగిల్ గా వచ్చిన ఈ చిత్రం తెలుగులో విజిల్ గా విడుదల అయ్యింది. తెలుగు , తమిళ బాషలలో కూడా మంచి వసూళ్ళని సాధించింది. ఈ చిత్రం ఏకంగా 200 కోట్ల వసూళ్ళని సాధించింది. విజయ్ - అట్లీ కాంబినేషన్ లో వచ్చిన మూడు చిత్రాలు కూడా సూపర్ హిట్ కావడంతో దిగ్విజయంగా హ్యాట్రిక్ ని కంప్లీట్ చేసినట్లయింది. డొమెస్టిక్ గా 200 కోట్లు సాధించిన హీరోలలో రజనీకాంత్ , ప్రభాస్ , యష్ ల తర్వాత విజయ్ కూడా చేరాడు.