సక్సెస్ కోసం ఇద్దరు హీరోల పోటీ

Published on Oct 23,2019 03:43 PM
ఈనెల 25 న రెండు చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఇక ఈ ఇద్దరు హీరోలు కూడా తమిళ హీరోలు కావడం విశేషం. ఇద్దరు తమిళ హీరోలు విజయం కోసం తెలుగులో పోటీ పడుతున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు తమిళ హీరోలు అని అనుకుంటున్నారా ? ఒకరేమో తమిళ స్టార్ హీరో విజయ్ కాగా మరొక స్టార్ హీరో కార్తీ. తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్ డం ఉన్న హీరో విజయ్ అయితే తెలుగులో మాత్రం అంతగా ఇమేజ్ లేదు పాపం ఈ హీరోకు. ఇక మరో హీరో కార్తీ కి కూడా తెలుగు తమిళ బాషలలో మంచి ఇమేజ్ ఉండేది కానీ కొంతకాలంగా తెలుగులో చాలావరకు మార్కెట్ పడిపోయింది కార్తీకి. అయితే తమిళనాట మాత్రం ఫరవాలేదు కాస్త. ఈనెల 25 న విజయ్ నటించిన బిగిల్ తెలుగులో విజిల్ గా వస్తోంది , అలాగే కార్తీ ఖైదీ సినిమా కూడా. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది విజయవంతం అవుతుందో తెలుగులో.