వేణు మాధవ్ మూడు రోజులు బ్రతికిఉంటే....

Published on Sep 27,2019 10:39 AM

హాస్య నటుడు వేణు మాధవ్ నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే, దాంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సెప్టెంబర్ 25 న వేణుమాధవ్ చనిపోయాడు అయితే సెప్టెంబర్ 28 న తన పుట్టినరోజు దాంతో పుట్టినరోజు సందర్బంగా భారీ ఎత్తున జన్మదిన వేడుకలు చేయాలనీ తపించారట వేణుమాధవ్ స్నేహితులు.
ఆమేరకు ఏర్పాట్లు కూడా చేశారట కానీ పుట్టినరోజు కి మూడు రోజుల ముందే చనిపోవడంతో ఆ విషయాన్నీ గుర్తు చేసుకుంటూ కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు వేణుమాధవ్ స్నేహితులు. తెలుగులో పలు చిత్రాల్లో హాస్య నటుడిగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణుమాధవ్ అర్దాంతరంగా కన్నుమూయడంతో వేణుమాధవ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.