వెంకీ కొత్త సినిమా ఎప్పటి నుండో తెలుసా

Published on Dec 21,2019 09:22 AM

వెంకీ మామ చిత్రంతో మంచి హిట్ అందుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తమిళంలో సంచలన విజయం సాధించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు వెంకీ. వరుస ప్లాప్ లతో మూడేళ్ళుగా చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉన్న శ్రీకాంత్ అడ్డాల కు మళ్ళీ మెగా ఫోన్ ఇచ్చారు వెంకటేష్ - సురేష్ బాబులు. శ్రీకాంత్ అడ్డాల వరుస ప్లాప్ లను చవిచూశాడు కాబట్టి సక్సెస్ కోసం కసిగా ఉన్నాడని అతడి చేతిలో ఈ ప్రాజెక్ట్ పెట్టారు అన్నా దమ్ములు ఇద్దరూ. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళనుందో తెలుసా ...... జనవరి 2 న.

అవును జనవరి 2 నుండి అసురన్ రీమేక్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం మిగతా స్టార్ కాస్టింగ్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకోసం పెద్ద ఎత్తున కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున స్పందన రావడంతో వాళ్లలో కొంతమందిని సెలెక్ట్ చేసారు దర్శకులు శ్రీకాంత్ అడ్డాల. ఎఫ్ 2 , వెంకీ మామ ల సక్సెస్ తో మంచి జోష్ మీదున్నాడు వెంకీ.