ఖమ్మం బయలుదేరిన వెంకీమామ

Published on Dec 07,2019 01:46 PM

వెంకీ మామ చిత్ర బృందం కొద్దిసేపటి క్రితం ఖమ్మం బయలుదేరింది. కె ఎస్ రవీంద్ర ( బాబీ ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ - నాగచైతన్య లు హీరోలుగా నటించారు. నిజ జీవితంలో మేనమామ - మేనల్లుడు అయిన వెంకీ - చైతూ లు సినిమాలో కూడా మామా - అల్లుళ్లుగా నటించడం విశేషం. వెంకటేష్ సరసన హాట్ భామ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగచైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13 న విడుదల చేయనున్నారు. సినిమా విడుదలకు వారం రోజులు కూడా లేకపోవడంతో వెంకీ మామ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈరోజు ఖమ్మం లో భారీ ఎత్తున చేయనున్నారు. అందుకోసం కొద్దిసేపటి క్రితం వెంకీ మామ చిత్ర బృందం ఖమ్మం కు బయలుదేరింది. యాక్షన్ తో పాటుగా వినోద ప్రధానంగా తెరకెక్కిన ఈ వెంకీ మామ చిత్రం మామా - అల్లుళ్ళ కు ప్రత్యేకమనే చెప్పాలి.