బ్రేక్ ఈవెన్ దిశగా వెంకీ మామ

Published on Dec 27,2019 04:49 PM

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ , అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన వెంకీ మామ బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతోంది. డిసెంబర్ 13 న భారీ ఎత్తున విడుదలైన వెంకీ మామకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి అయితే ఈ సినిమాని 33 కోట్లకు థియేట్రికల్ రైట్స్ కు అమ్మారు. దాంతో 33 కోట్లకు పైగా షేర్ వస్తే హిట్ అనిపించుకుంటుంది. అయితే డిసెంబర్ 20 న నాలుగు సినిమాలు విడుదల కావడంతో ఆరోజున వెంకీ మామకు పెద్ద దెబ్బ పడింది ఆరోజు కలెక్షన్లు సరిగా రాలేదు కట్ చేస్తే డిసెంబర్ 20 న విడుదలైన చిత్రాల్లో ప్రతి రోజూ పండగే చిత్రం తప్ప మిగతా సినిమాలు అంతగా ప్రభావం చూపించకపోవడంతో 14 రోజుల్లో 75 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించింది వెంకీ మామ.

75 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి కానీ షేర్ రూపంలో 31 కోట్లు మాత్రమే వచ్చాయి అంటే మరో రెండు కోట్లు వస్తేనే కానీ బయ్యర్లు సేఫ్ అవ్వరు. అయితే ఇప్పుడు వచ్చేవి పెద్ద సినిమాలు ఏమి కాదు పైగా ఉన్న సినిమాలు అంతగా ప్రభావం చూపించడం లేదు కాబట్టి మరో మూడు నాలుగు రోజుల్లోనే బయ్యర్లు సేఫ్ అవ్వడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ నటించగా నాగచైతన్య సరసన రాశి ఖన్నా నటించింది. ఇక ఈ చిత్రానికి కె ఎస్ రవీంద్ర దర్శకత్వం వహించాడు.