అదరగొడుతున్న వెంకీ మామ

Published on Dec 15,2019 06:40 PM

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ , అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామ కలెక్షన్స్ పరంగా అదరగొడుతోంది. డిసెంబర్ 13 న విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 7 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసింది. 16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి దాంతో చిత్ర యూనిట్ సంబరపడిపోయింది. ఇక రెండో రోజున కూడా అదే జోరు చూపిస్తూ మరో 4 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది దాంతో 2 రోజుల్లోనే 11. 83 కోట్ల షేర్ వచ్చింది అంటే రెండు రోజుల్లో దాదాపుగా 12 కోట్ల షేర్ అన్నమాట. ఈరోజు ఎలాగూ ఆదివారం కాబట్టి ఈ సినిమాని కొన్న బయ్యర్లు వీకెండ్ లోనే గట్టెక్కడం ఖాయంగా కనిపిస్తోంది అంటే వెంకీ మామ ని కొన్నవాళ్లకు లాభాలు రావడం ఖాయమైపోయింది.

కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ - నాగచైతన్య ఇద్దరు కూడా మామా - అల్లుళ్లుగా నటించారు. ఎంటర్ టైన్ మెంట్ , యాక్షన్ , సెంటిమెంట్ , కలగలిపి ఉన్న సినిమా కావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు వెంకీ మామ చిత్రానికి. రెండు తెలుగు రాష్ట్రాలలో వెంకీ మామ బాగానే వసూల్ చేస్తున్నాడు కానీ ఓవర్ సీస్ లో మాత్రం కాస్త తడబడ్డాడు మరి. తెలుగు రాష్ట్రాలలో మాత్రం వెంకీ సాలిడ్ హిట్ కొట్టినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.