20 కోట్ల షేర్ రాబట్టిన వెంకీ మామ

Published on Dec 17,2019 03:46 PM

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన వెంకీ మామ నాలుగు రోజుల్లో 20 కోట్ల షేర్ ని రాబట్టింది. 20 కోట్ల షేర్ రాబట్టడంతో ఇక మిగతా షేర్ కూడా రాబట్టి బయ్యర్లను సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే డిసెంబర్ 20 న బాలయ్య రూలర్ , సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 , కార్తీ దొంగ , సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతీ రోజూ పండగే చిత్రాలు విడుదల అవుతున్నాయి కాబట్టి తప్పకుండా ఈ మూడు రోజుల్లోనే మరిన్ని ఎక్కువ వసూళ్లు సాధించాలి. లేదంటే వెంకీ మామ కు ఇబ్బందే అని చెప్పాలి.

రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్ల నే రాబడుతున్నాడు వెంకీ మామ. కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 13 న విడుదలైన విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లోనే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని 20 కోట్ల షేర్ ని వసూల్ చేసింది ఈ చిత్రం. వెంకటేష్ , అక్కినేని నాగచైతన్య , రాశి ఖన్నా , పాయల్ రాజ్ పుత్ లు నటించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. వెంకీ మామ మంచి వసూళ్లు సాధించడంతో వెంకీ చాలా సంతోషంగా ఉన్నాడు