వంద కోట్ల క్లబ్ లో ఎఫ్ 2

Published on Jan 25,2019 12:10 PM

వెంకటేష్ -తమన్నా , వరుణ్ తేజ్ - మెహరీన్ జంటలుగా నటించిన ఎఫ్ 2 చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరింది . ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు . వంద కోట్ల గ్రాస్ 66 కోట్ల షేర్ తో సంచలనం సృష్టిస్తున్న ఎఫ్ 2 చిత్రం  70 కోట్ల లాభాల దిశగా దూసుకుపోతోంది . జనవరి 12న విడుదలైన ఈ ఎఫ్ 2 ని సంక్రాంతి రారాజుగా నిలిపారు ప్రేక్షకులు . 

వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ లతో పాటుగా నష్టాల్లో ఉన్న దిల్ రాజు కి సాలిడ్ హిట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి . ఈ సినిమా అందరికీ కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో చాలా సంతోషంగా ఉన్నారు ఆ చిత్ర బృందం . వరుసగా నాలుగు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో అనిల్ రావిపూడి కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది .