వెంకటేష్ కూతురు పెళ్లి రేపే

Published on Mar 23,2019 03:30 PM

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి రేపు జైపూర్ లో జరుగనుంది . అయితే ముందుగానే అక్కడికి చేరుకున్న వెంకటేష్ బంధుమిత్రులు సంగీత్ కార్యక్రమంలో వీర లెవల్లో రెచ్చిపోతున్నారు . ఇక ఈ వేడుకలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నాడు . డెస్టినేషన్ వెడ్డింగ్ గా జైపూర్ లో భారీ ఎత్తున ఈ పెళ్లి జరుగుతోంది . 

వెంకటేష్ కూతురు ఆశ్రిత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి లు ప్రేమించుకున్నారు . ఆశ్రిత - వినాయక్ రెడ్డి ల ప్రేమ కు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో ఈ జంట ఒక్కటి కాబోతోంది . రేపు అనగా 24 మార్చి 2019 న జైపూర్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగనుంది . అక్కడ పెళ్లి అయ్యాక హైదరాబాద్ లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు . వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు ఒక కొడుకు .