వెంకటేష్ భావోద్వేగ పోస్ట్ వైరల్

Published on Dec 14,2019 10:24 AM

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ భావోద్వేగంగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈరోజు వెంకటేష్ పుట్టిన రోజు కాగా ఇదే రోజున వెంకీ మామ చిత్రం కూడా విడుదల అయ్యింది. ఈ సినిమా కు హిట్ టాక్ రావడంతో చాలా ఉద్వేగానికి లోనయ్యాడు వెంకటేష్. ఈరోజు నువ్ ఉంటే బాగుండు నాన్నా ....... ఐ మిస్ యు నాన్నా అంటూ వెంకటేష్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. వెంకటేష్ తో పాటుగా తన మనవళ్లను కలిపి ఒక భారీ సినిమా నిర్మించాలని భావించాడు వెంకటేష్ తండ్రి , నిర్మాత దగ్గుబాటి రామానాయుడు. అయితే ఆయా కోరిక తీరకుండానే 2015 లో చనిపోయాడు.

దాంతో తన తండ్రి గుర్తుకు రావడంతో భావోద్వేగానికి లోనయిన వెంకటేష్ ఈరోజు మీ మనవడు నాగచైతన్య తో కలిసి సినిమా చేశాను నాన్నా అంటూ ఉద్వేగంతో పోస్ట్ పెట్టాడు. ఇంకేముంది తమ అభిమాన హీరో నుండి సెంటిమెంట్ తో కూడిన పోస్ట్ రావడంతో అది వైరల్ అవుతోంది. వెంకీ మామ చిత్రంలో వెంకటేష్ తో కలిసి నాగచైతన్య నటించిన విషయం తెలిసిందే. కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. సంక్రాంతి బరిలో దిగే చిత్రాలు రావడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో ఈ లోపు వెంకీ మామ మంచి వసూళ్ల ని రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.