ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్

Published on Jan 24,2019 11:30 AM

ఎఫ్ 2 తో సంక్రాంతి బరిలో దిగి సంచలన విజయం అందుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా విశాఖపట్టణం లోని నేచురల్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . వెంకటేష్ ఆసుపత్రిలో చేరాడు అనగానే ఏదో ప్రమాదం అని అనుకోవద్దు సుమా ! కేవలం వెన్ను నొప్పి కోసమే ! వెన్ను నొప్పితో కొంతకాలంగా బాధపడుతున్నాడు వెంకటేష్ దాంతో ప్రకృతి చికిత్స కోసం విశాఖపట్టణం కు చేరుకున్నాడు . 

అక్కడ చికిత్స తీసుకున్న అనంతరం హైదరాబాద్ రానున్నాడు . జనవరి 12 న విడుదలైన ఎఫ్ 2 వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది . ప్రపంచ వ్యాప్తంగా 65 కోట్ల షేర్ ని రాబట్టి సంచలనం సృష్టిస్తోంది . ఇంకా వసూళ్ల పరంగా మంచి స్పీడ్ లో ఉంది ఎఫ్ 2 . ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఎఫ్ 3 తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు .