మహేష్ బాబుకు సవాల్ విసిరిన వెంకటేష్

Published on Apr 23,2020 05:12 PM
చిన్నోడు మహేష్ బాబుని  ఛాలెంజ్ చేసాడు పెద్దోడు వెంకటేష్. బి ద రియల్ మ్యాన్ అనే ఛాలెంజ్ లో భాగంగా ఈ ఛాలెంజ్ చేసాడు వెంకీ. ఈరోజు తన ఇంట్లో పనులు చేసి దానికి తాలూకు వీడీయోని పోస్ట్ చేసిన వెంకీ ఇకపై మీరు కూడా ఈ పనులు చేయండి అని మహేష్ బాబు తో పాటుగా హీరో వరుణ్ తేజ్ దర్శకులు అనిల్ రావిపూడి లకు ఈ ఛాలెంజ్ విసిరాడు వెంకటేష్. కరోనా వల్ల షూటింగ్ లన్నీ ఆగిపోయాయి దాంతో ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఇక సెలబ్రిటీ లు కూడా ఇంట్లోనే ఉంటున్నారు.

ఇంతకుముందు పలువురు సినీ ప్రముఖుల ఇళ్లల్లో పెద్ద మొత్తంలోనే జనాలు ఉండేవారు పనికోసం. కానీ కరోనా వల్ల పనివాళ్ళు లేకుండాపోయారు అందుకే ఇంటి పనులు మహిళలు ఒకరే చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి మగవాళ్ళు కూడా సహాయం చేయాలనీ ఏ ఛాలెంజ్ మొదలయ్యింది. అందులో భాగంగా ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా , రాజమౌళి , ఎన్టీఆర్ , చరణ్ , కొరటాల శివ , సుకుమార్ , చిరంజీవి , వెంకటేష్  తదితరులు పూర్తి చేసారు.