వర్మకు దిమ్మతిరిగేలా షాక్

Published on Dec 01,2019 06:25 PM

దర్శకులు రాంగోపాల్ వర్మకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు సెన్సార్ మెంబర్లు. వివాదాస్పద చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రం నవంబర్ 29 న విడుదల చేయాలనుకున్నారు అయితే సెన్సార్ వాళ్ళు మాత్రం సర్టిఫికెట్ ఇవ్వలేదు దాంతో వర్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ కి బదులుగా '' అమ్మరాజ్యంలో కడప బిడ్డలు '' అనే టైటిల్ ని మార్చాడు. టైటిల్ మార్చినప్పటికీ చిత్రంలో చంద్రబాబు , జగన్ , పవన్ కళ్యాణ్ , కే ఏ పాల్ , లోకేష్ తదితరులను పోలిన పాత్రలు ఉండటంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది.

దాంతో సినిమా మొత్తాన్ని చూసిన సెన్సార్ బోర్డు చిత్రంలో పలు అభ్యంతరకర సన్నివేశాలు , డైలాగ్స్ ఉన్నట్లు గుర్తించి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో ఖంగుతిన్న వర్మ ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో పడ్డాడు. రీజనల్ సెన్సార్ బోర్డు రిజెక్ట్ చేయడంతో రివైజింగ్ కమిటీ కి వెళ్లనున్నారు వర్మ. అక్కడ ఓకే అయితే విడుదల అవుతుంది లేదంటే అంతే సంగతులు.