చెన్నకేశవులుని బాస్టర్డ్ అని తిడుతున్న వర్మ

Published on Feb 03,2020 12:19 PM

బాస్టర్డ్ చెన్నకేశవులు దిశ ని మాత్రమే పాడుచేయలేదు వాడు తన భార్య రేణుక జీవితాన్ని సైతం నాశనం చేసాడు అంటూ తిడుతున్నాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ. దిశపై జరిగిన అత్యాచారం , హత్య ల నేపథ్యంలో '' దిశ '' అనే సినిమా తీయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా అనుకున్న తర్వాత దిశ కేసులో ఒక అగంతకుడైన చెన్నకేశవులు భార్య రేణుక ని తన ఆఫీసులో కలిసాడు వర్మ. చెన్నకేశవులు భార్య చెప్పిన సంగతులు అన్నీ విన్న తర్వాత బాస్టర్డ్ వాడు నాశనం కావడమే కాకుండా దిశ తో పాటుగా మరో ఇద్దరి జీవితాన్ని నాశనం చేసాడని విమర్శిస్తున్నాడు.

చెన్నకేశవులు భార్య వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే! 16 వ ఏటనే ఆమెకు పెళ్లి కాగా ఇప్పుడు ఆమె వయసు 17 అంతేకాదు 17 ఏళ్ల వయసులోనే మరో పాపకు జన్మనివ్వ బోతోంది దాంతో ఆ ఇద్దరి జీవితం కూడా నాశనమే అయినట్లు కదా ! అందుకే ఆ ఉద్దేశ్యంతో అలా అని ఉంటాడు వర్మ. మొత్తానికి సంచలన సంఘటనలను ఆధారంగా చేసుకొని సినిమాలు చేసే వర్మ దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు కానీ సరైన రీతిలో మాత్రం తీయడం లేదు.