అమెరికా అధ్యక్షుడిపై వర్మ సెటైర్లు

Published on May 02,2020 11:29 AM
సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై సెటైర్లు వేసాడు. అమెరికా దేశానికి ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది డోనాల్డ్ ట్రంప్ మాత్రమే అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు వర్మ. కరోనా మహమ్మారి అమెరికాపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ తొలినాళ్ళలో ట్రంప్ పెద్దగా పట్టించుకోలేదు , అది అలా వచ్చి ఇలా పోతుందిలే అని లైట్ గా తీసుకున్నాడు.

అయితే ఒక్క అమెరికాని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని శాసిస్తోంది కరోనా. ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కరోనా బారిన పడిన వాళ్లలో మొదటి స్థానంలో ఉంది అమెరికా. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు అమెరికన్లు . ఇలాంటి క్లిష్ట సమయంలో మంచి పరిపాలన సాగించాల్సింది పోయి అమెరికా లోపాలను ఎత్తిచూపుతూ తగని వ్యక్తి అనిపించుకున్నాడని పేర్కొంటూ కిమ్ తో కూడిన ట్రంప్ ఫోటోని మీమ్ చేస్తూ షేర్ చేసాడు.