జీసెస్ చీర్స్ అంటూ రచ్చ చేసిన వర్మ

Published on Dec 26,2019 01:54 PM

వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదాన్ని రాజేసాడు. నిన్న క్రిస్మస్ కావడంతో అర్ధరాత్రి జీసెస్ చీర్స్ అంటూ మద్యం గ్లాస్ ని చూపిస్తూ ఫోటోకు ఫోజు ఇవ్వడమే కాకుండా ఆ ఫోటో ని ట్వీట్ చేసాడు. ఇంకేముంది అది వైరల్ అవుతోంది. ఇక క్రిస్టియన్ లు అయితే వర్మ పైత్యం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన జీసెస్ కు చీర్స్ అంటూ మద్యంని అంటగడతావా అంటూ వర్మపై విరుచుకుపడుతున్నారు. మద్యం మత్తులో ఉన్నట్లుగా వర్మ ఫోటోలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు. దాంతో ఈ ఆగ్రహానికి కారణం అయ్యింది.

మొన్ననే హీరోయిన్ నైనా గంగూలీ తో కలిసి డ్యాన్స్ చేసి మరో రచ్చ చేసాడు వర్మ. అప్పుడు కూడా వర్మ మద్యం మత్తులోనే ఉన్నాడు. నైనా గంగూలీ ని కసిగా పట్టుకొని వచ్చీరాని డ్యాన్స్ లను చేస్తూ పిచ్చెక్కించాడు. రంగీలా సినిమాకు ట్రిబ్యూట్ అంటూ చేసిన బ్యూటిఫుల్ చిత్రంలో నైనా గంగూలీ హీరోయిన్ గా నటించింది. ఆ భామ అందాలను విచ్చలవిడిగా ఆరబోసి పిచ్చెక్కించింది. ఇక ఆ సినిమా జనవరి 1 న విడుదల అవుతోంది. ఇప్పటికే వర్మ నుండి వచ్చిన చిత్రాలన్నీ ఘోర పరాజయాలను చవి చూస్తున్నప్పటికీ వర్మ మాత్రం తన ఫ్యాక్టరీ నుండి ఇలాంటి విష వాయువులను పంపుతూనే ఉన్నాడు.